: ‘విశాఖ’లో స్వైన్ ఫ్లూ .. ఒక్కరోజే 8 కేసుల నమోదు!


విశాఖపట్నంలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కేవలం, ఈ రోజే 8 కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం, పర్యాటక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. కాగా, ఈ నెల 1, 2 తేదీల్లో స్వైన్ ఫ్లూ బారిన పడిన వారి సంఖ్య 11గా ఉంది. వీరు ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల రక్తనమూనాలు సేకరించి తిరుపతిలో స్విమ్స్ కు, ముంబయిలోని ఎస్ఆర్ఎల్ లేబొరేటరీలకు పంపగా ‘స్వైన్ ఫ్లూ’గా తేలినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News