: బాలికలకు సెల్‌ఫోన్లు ఇవ్వద్దు.. అమ్మాయిలు స్కార్ఫ్‌ కట్టుకుని తిరగొద్దు: బీజేపీ యూపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు


స్కూలుకెళ్లే బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడ‌ద‌ని, ఒక‌వేళ ఇస్తే లేనిపోని సంఘటనలకు దారి తీయడంతో పాటు, వారు కలవకూడని వారిని కలిసే అవకాశం ఉంద‌ని బీజేపీ నేత‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. బాలిక‌ల‌కు సెల్‌ఫోన్‌లు ఇవ్వ‌డంపై నిషేధం విధించాలని అలీఘర్ మేయర్ శకుంతల భారతి, ఎమ్మెల్యే సంజీవ్ రాజా అన్నారు. బాలిక‌ల‌కు సెల్‌ఫోన్‌లు ఇస్తే, వారు త‌ప్పుడు మార్గంలో వెళ్లే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. అసలు  బాలికలకు సెల్‌ఫోన్లతో అవసరం ఏంటని కూడా వారు ప్ర‌శ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే  సంజీవ్ రాజా మాట్లాడుతూ...  సెల్‌ఫోన్ల వల్ల లాభాలు ఉన్నప్పటికీ బాలికలకు మొబైల్ ఫోన్లు అవసరం లేదని అన్నారు.

ఇప్పటికే ప‌లు విద్యాసంస్థల్లో సెల్‌ఫోన్ల వినియోగాన్ని నిషేధించారని అన్నారు. అంతేకాదు, మహిళలు, యువతులు తమ ముఖాలను వస్త్రాలతో కప్పుకోకూడ‌ద‌ని, అలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేన‌ని ప‌లు వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు స్కార్ఫ్‌ కట్టుకుని బయట కనబడితే పోలీసులకు అప్పగిస్తామ‌ని గ‌తంలోనూ అప్పటి మేయర్ ఇటువంటి వ్యాఖ్య‌లే చేసి వార్త‌ల్లోకెక్కారు.

  • Loading...

More Telugu News