: పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే యువతిని గొంతునులిమి చంపేశాడు!
పెళ్లైన నాలుగు రోజులకే ఓ యువతి దారుణంగా హత్యకు గురయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. ముంబయికి చెందిన ఆసిఫ్ సిద్దిఖీ (25) అనే యువకుడు సబ్రీన్(22) అనే యువతిని పెద్దల సమక్షంలో గత నెల 6న ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్యను ముంబయిలోని బొరివాలికి తీసుకెళ్లాడు. అక్కడే తాను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. అయితే, తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని, బలవంతంగా తన పెళ్లి చేశారని అంటూ ఆ యువతిని గొంతునులిమి చంపేశాడు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఎట్టకేలకు నిందితుడిని లక్నోలో అరెస్టు చేశారు. తన భార్యను హత్య చేసిన రెండురోజుల తరువాత నిందితుడు ఆసిఫ్ ముంబయి నుంచి పారిపోయాడని పోలీసులు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.