: నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా..క్షమాపణలు చెప్పను : దిగ్విజయ్ సింగ్
తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తనపై ఎలాంటి కేసులు పెట్టినా అభ్యంతరం లేదని, భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ విషయమై న్యాయపోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఓ పక్క ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అంటూ, మరోపక్క ముస్లిం యువతను తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని అన్నారు.