: సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ప్రశంసలు.. 'థ్యాంక్స్’ చెప్పిన రాజమౌళి
భారత్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ‘బాహుబలి-2’ సినిమా రాబడుతున్న కలెక్షన్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికాలో గతంలో ఏ చిత్రానికి రానంతటి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ చిత్రం విడుదలైన మొదటి వీకెండ్ లోనే ఏకంగా 65.65 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. అమెరికాలో వెయ్యికి పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
గత గురువారం ప్రీమియర్ షోలు సహా శుక్రవారం నాటికి 45 లక్షల 62 వేల డాలర్లు, శనివారం.. 34 లక్షల 3 వేల డాలర్లు, ఆదివారం..22 లక్షల 45 వేల 100 డాలర్లు. ఈ మొత్తం విలువ మన కరెన్సీలో 65.65 కోట్లు అని పేర్కొన్నారు. అమెరికాలో ఓ భారతీయ సినిమా విడుదలైన మొదటి వీకెండ్ లోనే ఈ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించిన ఆయన, భారతీయ చలన చిత్ర రంగం గర్వపడేలా సినిమా తీసిన దర్శకుడు రాజమౌళికి ‘థ్యాంక్స్’ చెప్పారు. ఇందుకు స్పందించిన రాజమౌళి తిరిగి ధన్యవాదాలు తెలిపాడు.