: కళాతపస్వి విశ్వనాథ్ కు మరో అరుదైన గౌరవం


కళాతపస్వి, ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు మరో అరుదైన గౌరవం లభించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరించిన అనంతరం... వేదికపై ఆయన ప్రసంగించనున్నారు. 1969లో ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి ఇంత వరకు ఏ అవార్డు గ్రహీతకు వేదికపై ప్రసంగించే గౌరవం దక్కలేదు.

తొలిసారిగా ఓ అవార్డు గ్రహీత వేదికపై మాట్లాడటం కేవలం విశ్వనాథ్ తోనే ప్రారంభకాబోతోంది. మొట్టమొదటి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందిన దేవికా రాణి మొదలుకొని ఇంతవరకు ఏ ఒక్కరికీ కూడా వేదికపై ప్రసంగించే అవకాశం దక్కలేదు. విశ్వనాథ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టుబోతున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి చొరవతో ఇది సాధ్యమైంది. తన ప్రసంగంలో.... ఐదు దశాబ్దాలనాటి సినీ ప్రస్థానం, తెలుగు సినీ పరిశ్రమకు చేసిన కృషిపై ఆయన ప్రసంగించనున్నారు. 

  • Loading...

More Telugu News