: వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ మాదే: బీజేపీ


హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ అన్నారు. ఎంఐఎం పార్టీ కేవలం పాతబస్తీ పార్టీ అని... బీజేపీ జాతీయ పార్టీ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ సీటును బీజేపీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ఎంఐఎం పాలనలో పాతబస్తీలో కేవలం ఒవైసీ కుటుంబమే బాగుపడిందని విమర్శించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ పై కృష్ణసాగర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు దేన్ని రాజకీయం చేయాలో కూడా తెలియడం లేదని విమర్శించారు. తెలంగాణ పోలీసులపై డిగ్గీరాజా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వ అంతర్గత వ్యవస్థలపై ఆరోపణలు చేయడం అత్యంత దారుణమని చెప్పారు. 

  • Loading...

More Telugu News