: సోషల్‌మీడియాను ఫాలో కావాలి: సీఎం చంద్రబాబు


అమరావతిలో ఈ రోజు జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు త‌మ పార్టీ నేత‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీకి చెడ్డపేరు వచ్చిందని, ఫోక్స్‌ వ్యాగన్‌ వంటి సంస్థలు వచ్చి తిరిగి వెళ్లిపోయాయని ఆయ‌న అన్నారు. తాము ఆటోమొబైల్‌ పరిశ్రమలు తేవడానికి ఎంతో కష్టపడ్డామ‌ని, ప్ర‌స్తుతం కియా, ఇసుజు వంటి కంపెనీలు వచ్చాయని ఆయ‌న చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో కొన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయని, వాటిల్లో గెలుపే ల‌క్ష్యంగా అంద‌రూ కృషి చేయాలని అన్నారు. మహానాడు కమిటీలపై దృష్టి పెట్టాల‌ని, త్వ‌ర‌గా క‌మిటీలు ఏర్పాటు చేయాలని ఆయ‌న సూచించారు. నేత‌లు సోషల్‌మీడియాను ఫాలో కావాలని ఆయ‌న అన్నారు. నేతలు తమ వద్దనున్న ఫోన్లతో మాత్రమే కాకుండా కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల్లోనూ టచ్ లో ఉండాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News