: జగన్ రుజువు చేస్తే మేం దేనికైనా సిద్ధం: బొండా ఉమ


వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల పేరుతో జగన్ దొంగ దీక్షకు దిగారని విమర్శించారు. రైతులకు ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ మద్దతు ధరను ఏపీలోనే ఇస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా అన్యాయం జరిగిందని జగన్ నిరూపిస్తే... తాము దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News