: పర్ఫెక్ట్ హనీ ట్రాప్...ఐఎస్ఐఎస్ జీహాదీని పెళ్లి చేసుకున్న ఎఫ్బీఐ ఉద్యోగిని


పర్ఫెక్ట్ హనీ ట్రాప్ అంటే ఎలా ఉంటుందో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అమెరికాకు రుచిచూపించాడు. ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) లో సీక్రెట్ ట్రాన్స్ లేటింగ్ అధికారిగా విధులు నిర్వర్తించిన యువతిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ప్రేమ ముగ్గులోకి దించాడు. దీంతో ఎఫ్బీఐకి చెప్పకుండా ప్రేమాయణం నడిపిన ఘటనపై అమెరికా అత్యున్నత విభాగం విచారణకు ఆదేశించింది. దీని వివరాల్లోకి వెళ్తే....చెకొస్లేవియాలో పుట్టిన డేనియల్లా గ్రీన్...జర్మనీలో నివాసం ఉండేది...ఈ సమయంలో అమెరికా సైనికుడితో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఆ తరువాత అమెరికా వెళ్లింది. అక్కడే చదువుకుంది. ఓక్లహామాలోని కెమెరాన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

అనంతరం ఎఫ్బీఐలో ట్రాన్స్ లేటర్ గా విధుల్లో జాయిన్ అయి, సిరియాలో విధులు నిర్వర్తించేందుకు ఎంపికైంది. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల మాటలు ట్రాన్స్ లేట్ చేసే విభాగానికి అధికారిగా ఉంటూ... జర్మనీకి చెందిన ర్యాపర్, ప్రముఖ ఉగ్రవాది డెనిస్ కాస్పెర్ట్ ను వివాహం చేసుకుంది. వారిద్దరూ కాపురం కూడా చేశారు. డెనిస్ కాస్పెర్ట్..ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబూబకర్ బాగ్దాదీకి బాగా సన్నిహితంగా మెలిగేవాడని ఎఫ్బీఐ గుర్తించింది. అన్ని కార్యక్రమాలకు ఎఫ్బీఐకు సంబంధించిన సైట్ ను వినియోగించిన గ్రీన్...కాస్పెర్ట్ తో సంభాషణకు మాత్రం ప్రైవేటు అకౌంట్ ను వినియోగించింది. ఆమెపై విచారణకు ఎఫ్బీఐ ఆదేశించగా, ఈ వార్త ఇప్పుడు అమెరికాలో పెను కలకలం రేపుతోంది. 

  • Loading...

More Telugu News