: అవసరం లేకపోయినా... కడుపులు కోసేస్తున్నారు బాబోయ్!
కరీంనగర్ జిల్లా మరోసారి అపఖ్యాతిని మూటగట్టుకుంది. తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్న జిల్లాగా మరోసారి అవతరించింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలో 81.1 శాతం సిజేరియన్ ఆపరేషన్లతో వరుసగా నాలుగోసారి టాప్ ప్లేస్ లో నిలబడి చెడ్డ పేరు తెచ్చుకుంది. అంతేకాదు, సిజేరియన్ ఆపరేషన్లపై జాతీయ స్థాయిలో చేసిన సర్వేలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 90 శాతం సిజేరియన్లే జరుగుతున్నాయని సర్వేలో తేలింది. ప్రసవానికి వచ్చే మహిళలకు సుఖప్రసవం కోసం సిజేరియన్లే మేలు అనే విధంగా ప్రైవేట్ వైద్యులు తప్పుడు సలహా ఇస్తున్నారని సర్వే తెలిపింది.