: 50 మంది పాకిస్థానీల తలలు తీసుకురండి: బీఎస్ఎఫ్ జవాను కూతురు
భారత జవాన్ల తలలు నరికిన ఘటన పట్ల భారతీయుల రక్తం మరుగుతోంది. పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనంటూ సగటు భారతీయుడు గట్టిగా కోరుకుంటున్నాడు. మరోవైపు పాక్ సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ కుమార్తె సరోజ్... పాక్ పై నిప్పులు చెరిగారు. తన తండ్రి త్యాగానికి బదులుగా 50 మంది పాకిస్థానీల తలలు తీసుకురావాలని అన్నారు.
ఇదే దాడిలో మరణించిన మరో సైనికుడు పరమ్ జీత్ సింగ్ ఇటీవలే కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇంకా గృహ ప్రవేశం చేయకుండానే తన సోదరుడు చనిపోయాడని పరం జీత్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం తన తండ్రి ప్రాణ త్యాగం చేశారని... ఇది తమకు ఎంతో గర్వకారణంగా ఉందని పరమ్ జీత్ సింగ్ కుమార్తె సిమ్రన్ దీప్ అన్నారు.