: ఇన్ఫోసిస్ కీలక ప్రకటన.. భారీ సంఖ్యలో అమెరికన్లకు ఉద్యోగాలు


భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, రాబోయే రెండేళ్లలో అమెరికాలో భారీ సంఖ్యలో అమెరికన్ ఉద్యోగులను నియమించుకుంటున్నట్టు ప్రకటించింది. అమెరికాలో స్థానికులకు ప్రాముఖ్యతను ఇస్తామని తెలిపింది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో సుమారు 10 వేల మంది అమెరికన్లను నియమించుకోవడానికి ఇన్ఫోసిస్ రెడీ అవుతోంది. అమెరికాలో కొత్తగా నాలుగు టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించనున్నామని... అందులో మొదటి సెంటర్ ను ఆగస్టు నెలలో ఇండియానాలో ప్రారంభించనున్నట్టు ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తెలిపారు. టీసీఎస్, విప్రో సంస్థలు కూడా స్థానిక అమెరికన్లకే పెద్ద పీట వేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News