: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. టీటీడీ ఈవో గా అనిల్ కుమార్ సింఘాల్


ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. ప్రస్తుతం టీటీడీ ఈవో గా ఉన్న సాంబశివరావును రాష్ట్ర వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్కైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ ప్రకాష్ ను, ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా బాబు.ఎ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా జె.నివాస్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు స్వీకరించే వరకు అర్జా శ్రీకాంత్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • Loading...

More Telugu News