: రాష్ట్రంలో హరీశ్ రావే పెద్ద విధ్వంసకారుడు: టీడీపీ నేత సండ్ర


తెలంగాణ రాష్ట్రంలో హరీశ్ రావే పెద్ద విధ్వంసకారుడని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం కావాలనే తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, అధికార పార్టీ ప్రలోభాలకు లొంగలేదని తనను వేధిస్తున్నారని, రైతులను పరామర్శించడానికి వెళితే తనపై కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారని అన్నారు. కాగా, ఖమ్మం మార్కెటు యార్డులో జరిగిన విధ్వంసంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ నేత ఆనందరావు సహా పదకొండు మందిపై కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News