: అతడి గొంతులో 40 పిన్నులు.. కుడికాలులో 25.. అంతా మిస్టరీ!


రాజ‌స్థాన్‌లోని కోటకు చెందిన బద్రీలాల్‌ మీనా రైల్వే ఉద్యోగి. ఇటీవ‌ల‌ అతని కాలికి గాయం అయింది. ఆసుప‌త్రికి వెళ్లి ఏవో మందులు తెచ్చుకొని వాడ‌గా ఆ గాయం మానిపోయింది. అయితే, కొన్నిరోజుల తరువాత శరీరంలోని ఇతర భాగాల్లోనూ గాయాలు కావడంతో అత‌డి కుటుంబసభ్యులు కోటలోని రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లి చెక్ చేయించారు. ఆయ‌న‌కు ఎక్స్‌రే తీసిన వైద్యులు సైతం ఆయ‌న శ‌రీరంలో పిన్నులు ఉన్నాయ‌ని తెలుసుకొని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

ఆయ‌న‌ గొంతులో 40, కుడికాలులో 25, చేతుల్లో మరికొన్ని పిన్నులు ఉన్నట్లు ఎక్స్‌రే ద్వారా తెలిసింద‌ని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం స‌ద‌రు బాధితుడు ముంబ‌యిలోని జగ్జీవన్‌రామ్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అత‌డి శరరంలోకి అన్ని పిన్నులు ఎలా చేరాయన్న విషయం అత‌డి కుటుంబ సభ్యులకు కూడా తెలియ‌డం లేదు. ఆ వ్య‌క్తి ఇప్పుడు తినడం, మాట్లాడటం లాంటివి కూడా చేయలేకపోతున్నాడు. అత‌డికి మ‌ధుమేహం కూడా ఉంద‌ని, చికిత్స కొన‌సాగిస్తున్నామ‌ని వైద్యులు చెప్పారు.

  • Loading...

More Telugu News