: దీక్షకు దిగిన జగన్ కు మంత్రి ప్రత్తిపాటి సవాల్!


గుంటూరు జిల్లా నల్లపాడు రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలో రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఈ రోజు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి దీక్ష ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు విరుచుకుప‌డ్డారు. రైతు సమస్యలపై జగన్ చర్చకు సిద్ధమా? అని ప్ర‌త్తిపాటి స‌వాలు విసిరారు.

రైతుకు గరిష్ఠంగా లక్ష‌న్న‌ర రూపాయ‌ల రుణ‌మాఫీ చేసింది టీడీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని ఉద్ఘాటించారు. ఏ రాష్ట్రం చేయని విధంగా 24 వేల కోట్ల రూపాయల మేర రైతుల రుణాలు మాఫీ చేశామ‌ని ఆయ‌న అన్నారు. అస‌లు జ‌గ‌న్ కు వ్య‌వ‌సాయం గురించి తెలుసా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ అన‌వ‌స‌ర‌ ఆరోప‌ణ‌లు చేస్తే ప్ర‌జ‌లు న‌మ్మ‌బోరని ఆయ‌న అన్నారు. స్వామినాథ‌న్ క‌మిటీ సిఫార్సుల అమ‌లుకు కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌స్తామ‌ని ఆయ‌న అన్నారు. మిర్చి రైతుల‌ను ఆదుకుంటామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News