: దిగ్విజయ్ క్షమాపణలు చెప్పకపోతే సరైన చర్యలు తీసుకుంటాం: మంత్రి కేటీఆర్


తెలంగాణ పోలీసులను కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్లు చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, అసంబద్ధంగా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించాలని అన్నారు. తెలంగాణ పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే, తెలంగాణ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ హెచ్చరించారు. కాగా, తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్ సైట్ తయారు చేసి యువతను రెచ్చగొడుతునున్నారని, యువతను రెచ్చగొట్టాలని కేటీఆర్ పోలీసులకు అధికారమిచ్చారా? అంటూ దిగ్విజయ్ మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  లేనిపక్షంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తిరిగి స్పందించారు.

  • Loading...

More Telugu News