: గ్రనైడ్లు నింపిన రాకెట్‌ను ప్రయోగించిన పాక్‌.. ఇద్ద‌రు భార‌త జ‌వాన్ల మృతి


పాకిస్థాన్ త‌న దుందుడుకు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తోంది. స‌రిహ‌ద్దు ప్రాంతంలో కాల్పుల‌కు పాల్ప‌డుతూ భార‌త్‌ను రెచ్చ‌గొడుతోంది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ రేజంర్లు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచారు. ఈ కార‌ణంగా ఇద్ద‌రు భార‌త జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే... పూంఛ్‌ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌ నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులు జరపడంతో భార‌త‌ భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో భార‌త్‌ను ఎదుర్కోలేని పాకిస్థాన్.. గ్రనైడ్లు నింపిన రాకెట్‌ను ప్రయోగించడంతో ముగ్గురు భార‌త‌ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ వారిలో ఇద్దరు జ‌వాన్లు అమ‌రుల‌య్యారు.

  • Loading...

More Telugu News