: 'నా కొడుకు జుట్టు తొందరగా కత్తిరిస్తావా? పుచ్చె లేపేయమంటావా?' అంటూ గన్ తీసింది.... వీడియో చూడండి


అమెరికాలోని షికాగో నగరంలో చోటుచేసుకున్న ఘటన పెను కలకలం రేపుతోంది. హెయిర్ సెలూన్ కు కొడుకును తీసుకెళ్లిన ఒక మహిళ... హెయిర్ స్టైలిస్ట్ ఆలస్యం చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో తీవ్ర అసహనంతో ఆ హెయిర్ స్టైలిస్టును సమీపించి, తొందరగా జుట్టు కత్తిరించాలని సూచించింది. ఆమె తన పని తాను చేసుకుంటుండడంతో ఆగ్రహానికి గురైన సదరు మహిళ... వెంటనే తన హ్యాండ్  బ్యాగులోంచి గన్ తీసి, ఆమెకు గురిపెట్టింది.

దీంతో ఆ షాపులో పని చేసే మరో వ్యక్తి వచ్చి ఆమెను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ వెంటనే ఆమె వేగంగా అతని జుట్టు కత్తిరించి ఆమెకు అప్పగించింది. జట్టు కత్తిరించడం ఆలస్యమైనందుకు తుపాకీ తీసిందా? అని అంతా ఆశ్చర్యంతో ఆ వీడియోను చూస్తున్నారు. మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News