: మూడంటే మూడు రోజుల్లో రూ. 450 కోట్లు కొల్లగొట్టిన బాహుబలి!
దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసినట్టుగా ఇకపై భారతీయ సినిమాను 'బీబీ మరియు ఏబీ' (బిఫోర్ బాహుబలి - ఆఫ్టర్ బాహుబలి) అనక తప్పదేమో. ఈ చిత్రం ఏ నిర్మాత, సూపర్ హీరోలకు సాధ్యంకాని ఫీట్ ను సాధించినట్టు తెలుస్తోంది. ముచ్చటగా మూడంటే మూడు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ రూ. 450 కోట్లను దాటినట్టు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి, ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ. 450 కోట్లను దాటి ఉంటుందని అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు. భారత చిత్రాల్లో ఇప్పటివరకూ అమీర్ ఖాన్ చిత్రం 'పీకే' సాధించిన రూ. 792 కోట్ల కలెక్షన్స్ రికార్డుగా ఉండగా, బాహుబలి ఆ రికార్డును తొలి వారంలోనే అధిగమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రూ. 1000 కోట్ల వసూళ్లను దాటే తొలి ఇండియన్ సినిమా కూడా ఇదేనని సినీ వర్గాలు నమ్మకంతో చెబుతున్నాయి.