: జగన్ ఏం చేసినా లక్ష్యం సీఎం పదవే!: బొండా ఉమ
వైకాపా అధినేత జగన్ ఏం చేసినా, ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి పదవేనని, జగన్ చేపట్టిన దీక్ష రైతుల కోసం కానే కాదని, సీఎం కుర్చీ కోసమని తెలుగుదేశం నేత బొండా ఉమ విమర్శించారు. ఈ ఉదయం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలన్న కుతంత్రంతోనే ఆయన దీక్షలకు దిగుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయంపై జగన్ కు ఎంతమాత్రమూ అవగాహన లేదని, రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎన్నో మంచి పనులను చేసిందని, అసలు సాధ్యమే కాదని జగన్ చెప్పిన రుణమాఫీని సాధ్యం చేసి చూపించామని ఆయన చెప్పుకొచ్చారు. ఆనాడు రుణమాఫీని వ్యతిరేకించిన జగన్ కు నేడు దీక్ష చేసే హక్కు లేదని దుయ్యబట్టారు.