: గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్... నల్లపాడుకు ప్రయాణం
గుంటూరు శివారులోని నల్లపాడులో రైతుదీక్ష చేపట్టేందుకు నిర్ణయించిన వైకాపా అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్ కు వైకాపా శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆపై రోడ్డు మార్గం గుండా భారీ కాన్వాయ్ వెంటరాగా, ఆయన నల్లపాడుకు బయలుదేరారు. రాష్ట్రంలోని రైతులకు మద్దతు ధర కల్పించాలని, ఆత్మహత్యల నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, జగన్ ఈ దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే.