: బాహుబలిపై మళ్లీ ట్వీట్లేసిన వర్మ
రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి: ది కన్ క్లూజన్' ఘన విజయంపై నిత్యమూ తనదైన శైలిలో ట్వీట్లు వేస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన అభిప్రాయాలను చెప్పారు. దీని ప్రభావం బాలీవుడ్ మీదే అత్యధికంగా పడిందని అన్నారు. ఇకపై ఏ సూపర్ హీరో అయినా, సూపర్ స్టార్ అయినా, తన తరువాతి చిత్రాన్ని బాహుబలి రెండో భాగంతోనే పోల్చుకోవాల్సి వుందని చెప్పారు. భారత సినీ పరిశ్రమ అందించిన 'అవతార్' సినిమా ఇదని పొగడ్తలు గుప్పించారు. తన 'అవతార్' చిత్రం కోసం జేమ్స్ కామెరూన్ ఖర్చు పెట్టిన డబ్బు, సమయంలో అణువంత మాత్రమే రాజమౌళి వెచ్చించారని అన్నారు.
BB2 impact on Bollywood will be tremendous bcos every super director nd super star for their next blockbuster will have to refer to BB2
— Ram Gopal Varma (@RGVzoomin) April 30, 2017