: బాహుబలి ప్రభంజనంతో తారుమారైన ఓవర్సీస్ రికార్డులివే...!


రాజమౌళి క్రియేటివ్ వండర్ 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ప్రభంజనం ముందు రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఓవ‌ర్సీస్ లో ఈ సినిమా నెలకొల్పిన రికార్డుల‌ను సినీ ప్రేమికులు నభూతో నభవిష్యతి అంటున్నారు. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా దెబ్బకు ఓవర్సీస్ లో రికార్డులన్నీ బద్దలయ్యాయని, పాత రికార్డుల స్థానంలో కొత్త రికార్డులు వచ్చి చేరాయని వారు చెబుతున్నారు. ఓవర్సీస్ రికార్డుల తాజా వివరాల్లోకి వెళ్తే... అమెరికాలో కేవలం రెండంటే రెండే రోజుల్లో 8 మిలియ‌న్ డాల‌ర్ల‌ు వసూలు చేసిన సినిమాగా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' నిలిచిందని, అక్క‌డి డిస్ట్రిబ్యూట‌ర్లు చెబుతున్నారు....

నెంబర్ 1 స్థానంలో 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' 8 మిలియ‌న్ డాలర్లు (56 కోట్ల రూపాయ‌లు) వసూలు చేసింది.
2వ స్థానంలో 'బాహుబలి-2: ద బిగెనింగ్' 7.51 మిలియ‌న్ డాల‌ర్లు (52.59 కోట్ల రూపాయ‌లు) వసూలు చేసింది.
3వ స్థానంలో 'శ్రీమంతుడు' 2.89 మిలియ‌న్ డాల‌ర్లు (20.23  కోట్ల రూపాయ‌లు) వసూలు చేసింది.
4వ స్థానంలో 'అ.. ఆ' 2.45 మిలియ‌న్ డాల‌ర్లు (17.15  కోట్ల రూపాయ‌లు) వసూలు చేసింది.
5వ స్థానంలో ఖైదీ నెం.150 2.45 మిలియ‌న్ డాల‌ర్లు (17.15  కోట్ల రూపాయ‌లు) వసూలు చేసి నిలిచింది.
6వ స్థానంలో 'నాన్న‌కు ప్రేమ‌తో' 2.02 మిలియ‌న్ డాల‌ర్ల (14.14  కోట్ల రూపాయ‌లు)తో నిలిచింది.
7వ ప్లేస్ లో 'అత్తారింటికి దారేది' సినిమా 1.90 మిలియ‌న్ డాల‌ర్ల (13.30  కోట్ల రూపాయ‌లు)వసూళ్లతో వుంది.
8వ స్థానంలో 'జ‌న‌తాగ్యారేజ్' 1.80 మిలియ‌న్ డాల‌ర్ల (12.60  కోట్ల రూపాయ‌లు)తో నిలిచింది.
9వ స్థానంలో 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' 1.66 మిలియ‌న్ డాల‌ర్లతో  (11.62  కోట్ల రూపాయ‌లు) నిలిచింది.
టాప్ టెన్ గా 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' 1.64 మిలియ‌న్ డాల‌ర్ల (11.48  కోట్ల రూపాయ‌లు)తో నిలిచింది.

  • Loading...

More Telugu News