: ఆ విషయం నాకు తెలియదు.. టీడీపీ వెబ్‌సైట్ చూసే పోస్టులు చేశా.. విచారణలో ‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్
ఏపీ శాసన మండలిపై అభ్యంతరకర పోస్టింగ్ చేసిన ‘పొలిటికల్ పంచ్’ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ ఆదివారం రెండోసారి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనమండలిపై పెట్టిన పోస్టింగ్ వివరాలున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అందించినట్టు తెలిపారు. ఎమ్మెల్యే అనితపై తాను పెట్టిన పోస్టింగ్ అభ్యంతరకరంగా లేదని, అటువంటప్పుడు తనపై అట్రాసిటీ కేసు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. అయినా తాను టీడీపీ అధికారిక వెబ్‌సైట్ చూసే పోస్టింగ్‌లు చేస్తున్నానని, ఆ వెబ్‌సైట్ తరహాలోనే తన పోస్టింగ్‌లు ఉంటాయని చెప్పుకొచ్చారు. శాసన మండలిపై అభ్యంతరకర పోస్టులు పెట్టకూడదన్న విషయం తనకు తెలియదని ఈ సందర్భంగా రవికిరణ్ పేర్కొన్నారు.