: అది నా లైఫ్ లో మరచిపోలేని సంఘటన: సినీ నటుడు సుమన్


‘అన్నమయ్య’ చిత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రను పోషించిన నటుడితో కలిసి ఈ చిత్రాన్ని చూస్తానని నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చెప్పిన విషయాలను ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ గుర్తు చేసుకున్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా లైఫ్ లో నేను మరచిపోలేని సంఘటన ఏంటంటే.. అప్పట్లో రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ గారు ‘అన్నమయ్య’ సినిమాను చూడాలనుకున్నారు. ఈ చిత్రం ప్రింట్ ను రాష్ట్రపతి భవన్ కు తెప్పించారు. ఈ ప్రింట్ అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఏమన్నారంటే.. ఈ చిత్రంలో వేంకటేశ్వస్వామి పాత్రను ఎవరైతే పోషించారో ఆయనతో కలిసి ఈ సినిమా చూడాలని వుందని అన్నారు. నాటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియతో కలిసి సినిమా చూసే భాగ్యం అందరికీ రాదు’ అని సుమన్ చెప్పుకొచ్చారు.

కాగా, సుమారు పంతొమ్మిది సంవత్సరాల క్రితం నాటి సినిమా అన్నమయ్య. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను నాగార్జున, శ్రీవేంకటేశ్వరస్వామి పాత్రను సుమన్ పోషించారు.

  • Loading...

More Telugu News