: నిర్మాతగా ధోనీ అవతారం.. తెరకెక్కనున్న ధ్యాన్‌చంద్ జీవిత గాధ!


టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ సినీ రంగంలో కాలుమోపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దేశం గర్వించే ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాకు ధోనీ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. ధ్యాన్‌చంద్ బయోపిక్‌ తీస్తున్నట్టు దర్శకనిర్మాత కరణ్ జోహార్ గతేడాదే ప్రకటించాడు. ఇప్పుడీ సినిమాను ధోనీతో కలిసి తీసేందుకు కరణ్ సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు రోహిత్ వైద్ కాగా, ధ్యాన్‌చంద్‌గా వరుణ్ ధావన్ నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News