: తమిళనాడులో కాలు మోపేందుకు సిద్ధమైన బీజేపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి తయారు!
వరుస విజయాలతో ఊపు మీదున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడులో కాలు మోపేందుకు సిద్ధమైంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడులో ఎలాగైనా పట్టుసాధించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అధిష్ఠానం స్థానిక సంస్థల ఎన్నికలను అందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
అన్నాడీఎంకే, డీఎంకేల నుంచి తమకు వచ్చిన నష్టమేమీ లేదని, తమిళనాడులో తమ విజయాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ తెలిపారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని మంత్రి స్పష్టం చేశారు.