: ఇలా మొదలై, అలా ముగిసిన తెలంగాణ అసెంబ్లీ... చర్చలేకుండా నిమిషాల్లోనే కీలక బిల్లుకు ఆమోదం


అత్యంత కీలకమైన భూ సేకరణ చట్ట సవరణ బిల్లుకు ఎటువంటి చర్చా లేకుండానే తెలంగాణ అసెంబ్లీ ఆమోదం పలికింది. ఈ ఉదయం బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాగా, సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న బీజేపీ, తెలుగుదేశం పార్టీల సభ్యులను లోనికి అనుమతించలేదు. బిల్లును ప్రవేశపెట్టగానే, మిర్చి రైతుల సమస్యలపై చర్చించాలని, అందుకు అంగీకరిస్తేనే కొత్త బిల్లుపై చర్చిద్దామని కాంగ్రెస్ సభ్యులు మెలిక పెట్టారు.

అందుకు అంగీకరించేది లేదని, మరోసారి రైతు సమస్యలపై చర్చిద్దామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, వినని కాంగ్రెస్ సభ్యులు పోడియం ముందు చుట్టుముట్టి నినాదాలు చేస్తుండటంతో, ఎటువంటి చర్చనూ చేపట్టకుండానే మూజువాణీ ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించిన స్పీకర్, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News