: వికీపీడియాతో జాతి భద్రతకు విపత్తంటూ నిషేధించిన టర్కీ


ప్రముఖ సమాచార సర్వస్వ వెబ్ సైట్ వికీపీడియాపై టర్కీ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఉగ్రవాదానికి మద్దతిస్తూ వెబ్ సైట్లో ఉన్న ఆర్టికల్స్ ను తొలగించాలని తాము ఆదేశించినప్పటికీ, వికీపీడియా యాజమాన్యం దాన్ని పట్టించుకోలేదని, ఈ కారణంతోనే నిషేధాన్ని విధించామని టర్కీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. టర్కీకి వ్యతిరేకంగా ఉగ్రవాదులు జరుపుతున్న ప్రచారానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని వికీపీడియా అందిస్తోందని, దీని వల్ల జాతి భద్రతకు విపత్తేనని రవాణా మంత్రి వెల్లడించారు. ఏఏ ఆర్టికల్స్ లో జాతి వ్యతిరేక సమాచారం ఉందన్న విషయాన్ని మాత్రం వెల్లడించని ఆయన, వికీపీడియా యాజమాన్యం టర్కీలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించి, పన్నులు చెల్లిస్తూ, వ్యతిరేక కంటెంట్ ను తొలగించిన తరువాతనే నిషేధాన్ని తొలగిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News