: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు షాకిచ్చిన సైన్యం
రహస్యంగా ఉంచాల్సిన ప్రభుత్వ విషయాలను బహిర్గతం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్పెషల్ అడ్వయిజర్, తారీఖ్ ఫతేమీని పదవి నుంచి తొలగించాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను సైన్యం తిరస్కరించింది. ప్రధాని ఆదేశాలను పాటించబోమని, తారీఖ్ పై ఇచ్చిన నివేదిక అసంపూర్ణంగా ఉండటమే ఇందుకు కారణమని తేల్చి చెబుతూ, ఆయనకు షాకిచ్చింది. కాగా, ఇండియా, ఆఫ్గన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అంశంపై, ప్రభుత్వం, సైన్యం మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు ఓ సమావేశంలో తారీఖ్ ఫతేమీ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు నవాజ్ షరీఫ్ ఓ కమిటీని వేయగా, అది ఫతేమీని దోషిగా తేల్చింది. ఈ నివేదికను ఇప్పుడు సైన్యం తోసిపుచ్చడం గమనార్హం.