: నంద్యాల స్థానంపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: శిల్పా మోహన్ రెడ్డి
భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన కర్నూలు జిల్లా నంద్యాల నియోజక వర్గ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి ఎంపికపై కీలక కసరత్తు జరుపుతున్న టీడీపీ నేతలు తుది నిర్ణయం తీసుకునే దిశగా కదులుతుండడంతో ఈ అంశంపై శిల్పా మోహన్ రెడ్డి స్పందించారు. నంద్యాల నియోజక వర్గం నుంచి టికెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు టికెట్ రాకపోతే, పార్టీ మారతారని అందరూ భావించారు. అయితే, నంద్యాల స్థానంపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని శిల్పా మోహన్ రెడ్డి ఈ రోజు మీడియాకు తెలిపారు. తాను పార్టీ మారే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. నంద్యాల ఎన్నికపై తుది నిర్ణయం చంద్రబాబు నాయుడిదేనని ఆయన అన్నారు.