: అందుకే భార్యలకు తలాక్ చెబుతున్నారు: యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు


మూడు సార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చేసి, మ‌రొక‌రిని పెళ్లి చేసుకునే ప‌ద్ధ‌తిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ విషయంపై దేశంలోని ప‌లు చోట్ల ప‌లువురు ముస్లిం మ‌హిళ‌లు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, త్రిపుల్ త‌లాక్‌పై ఉత్తరప్రదేశ్‌ కేబినెట్‌ మంత్రి, బీజేపీ నేత‌ స్వామి ప్రసాద్‌ మౌర్య తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఈ ప‌ద్ధ‌తిని ఉపయోగించుకొని భార్యలను మారుస్తూ తమ ‘కోరికలని’ సంతృప్తి పరుచుకుంటున్నారని స్వామి ప్రసాద్‌ మౌర్య అన్నారు. తలాక్ కు ఎటువంటి ప్రాతిపదిక లేదని ఆయన పేర్కొన్నారు. ముస్లిం మహిళలకు త‌మ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని అన్నారు. ఈ విష‌యం అహేతుక, నిరంకుశమైన విధాన‌మ‌ని ఆయ‌న అన్నారు. ఒక వ్యక్తి తన కోరికను సంతృప్తి పరచుకోవడానికి తరచూ భార్యలను మార్చి, భార్యాపిల్ల‌ల‌ను ఇబ్బందుల పాలు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News