: కోర్టు ఆదేశాలతో స్పీకర్ కోడెల కుమారుడిపై కేసు నమోదు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వైసీపీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న కేటుల్ టీవీ కార్యాలయంపై గతంలో టీడీపీ వర్గీయులు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే కేబుల్ వైర్లు కత్తిరించి ప్రసారాలను ఆపేశారు. దీనికి సంబంధించి బాధితుడు కోడెల శివరామ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా... వారు కేసు నమోదు చేయలేదు. దీంతో, ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, శివరామ్ పై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించడంతో... పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News