: ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం


హైదరాబాద్ జూబ్లీహిల్స్, జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని రెండో ఫ్లోర్ లో ఏసీ ఆన్ చేయగానే మంటలు వచ్చాయి. మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఈ క్రమంలో రెండు, మూడు ఫ్లోర్లలోని ఫర్నిచర్ కాలిపోయింది. అగ్నిప్రమాదం కారణంగా ఆంధ్రజ్యోతి సమాచార సేవలకు కూడా కాసేపు అంతరాయం కలిగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్న సిబ్బంది కిందకు వచ్చేందుకు వీలుకాకపోవడంతో... వారిని పక్క భవనాల మీదకు తీసుకెళ్లి, కిందకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News