: కోర్టు ప్రాంగణంలోనే ఖైదీని కాల్చి చంపిన దుండగులు


ఈ రోజు ఉద‌యం ఢిల్లీలోని రోహిణి కోర్టు ముందు క‌ల‌క‌లం చెల‌రేగింది. కిడ్నాప్‌లు, హత్యలు చేస్తూ గ్యాంగ్‌స్టర్‌గా మారి గ‌త ఏడాది ప‌ట్టుబ‌డిన‌ నీరజ్ బావ‌నా ఈ రోజు హ‌త్య‌కు గుర‌య్యాడు. ఆ ఖైదీని ఓ కేసులో విచారణ నిమిత్తం ఈ రోజు ఉద‌యం కోర్టుకు తీసుకొచ్చామ‌ని, అయితే, అదే స‌మ‌యంలో ఇద్దరు వ్యక్తులు నీరజ్‌పై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన అత‌డిని ఆసుపత్రికి తీసుకెళ్ల‌గా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడ‌ని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ ఇద్దరినీ తాము అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News