: ఆంధ్ర కాంట్రాక్టర్లతో కేసీఆర్ కుమ్మక్కు.. వేల కోట్ల ముడుపులు తీసుకున్నారు: కోమటిరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో... పనులన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించి, వేల కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, వర్శిటీలో కేసీఆర్ మాట్లాడకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయన స్థానంలో మరెవరు ఉన్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేవారని అన్నారు. మాట్లాడే తీరును కూడా కేసీఆర్ మార్చుకోవాలని సూచించారు. తాము పార్టీ మారుతున్నామనే వార్తలను ఖండించిన కోమటిరెడ్డి... గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వారే పార్టీలు మారతారని ఎద్దేవా చేశారు.