: డబ్బులిస్తావా, వేసెయ్యమంటావా? అంటూ దుండగుడు తలకు తుపాకీ గురిపెడితే... కౌంటర్ లోని వ్యక్తి కూల్ గా ఏం చేశాడో ఈ వీడియో చూడండి


అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఎవరైనా తుపాకీ తీసుకొచ్చి తలకు గురిపెట్టి డబ్బులివ్వు అంటే ముందు ఆందోళనకు గురవుతాం...గందరగోళంతో వాడేమన్నాడో పట్టించుకోకుండా నన్ను ఏమీ చేయకు అంటూ ముందు వాడిని బతిమాలడం మొదలు పెడతాం. లేదా అతడితో కలబడే ప్రయత్నం చేస్తాం. అయితే అమెరికాలోని కాన్సాస్‌ లోని జిమ్మీ జాన్స్ రెస్టారెంటులో క్యాషియర్ మాత్రం చాలా విభిన్నంగా స్పందించాడు. జిమ్మీ జాన్స్ రెస్టారెంట్ కు ఒక వినియోగదారుడు వచ్చాడు. క్యాష్ కౌంటర్ లో ఉన్న వ్యక్తితో మాటలు కలిపాడు. తరువాత నెమ్మదిగా జేబులోంచి పిస్తోలు తీసి క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బులు తీసి బయటపెట్టమన్నాడు.

ఒక్క  క్షణం అతనిని తేరిపార చూసిన క్యాష్ కౌంటర్ లో ఉన్న వ్యక్తి...అతను బలంగా ఉండడంతో ఎదురు తిరగడం కంటే డబ్బులిచ్చేయడం బెటర్ అని నిర్ణయానికి వచ్చాడు. ఇంతలో ఆ దుండగుడు తుపాకీని అతని తలకు గురిపెట్టాడు...దీంతో వెంటనే చేతికి ఉన్న గ్లోవ్ తీసేసి, కౌంటర్ లో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేశాడు. 'ఇంకా?' అని వాడు గద్దించడంతో 'తీసుకో' అంటూ ఏకంగా క్యాష్ బాక్స్ ను వాడి చేతుల్లో పెట్టేశాడు. అయితే, కేవలం డబ్బులు మాత్రమే తీసుకున్న దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. దీనిని సదరు షాప్ యజమాని సోషల్ మీడియాలో పెట్టడంతో అతని నిబ్బరానికి అంతా ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News