: జలయోధుడి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. చాలా బాధాకరమన్న సీఎం


ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, టీఎస్ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్వార్తను విన్న తర్వాత విషాదంలో మునిగిపోయారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పెద్దన్నలా విద్యాసాగర్ రావు వ్యవహరించేవారని చెప్పారు. బంగారు తెలంగాణ సాధించే క్రమంలో మనతో పాటు ఉండాల్సిన విద్యాసాగర్ రావు... అర్థాంతరంగా మనల్ని వదిలి వెళ్లిపోవడం బాధాకరమని చెప్పారు. ఆయన మరణం తెలంగాణ జాతికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని తాను భావించానని... ఇలా జరుగుతుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జయశంకర్ సార్ తర్వాత మనకు దొరికిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర్ రావు అని కేసీఆర్ అన్నారు. ఆయన ప్రాణాలను దక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశామని... కానీ, ఫలితం దక్కలేదని తెలిపారు. తీవ్ర అనారోగ్యం కారణంగా విద్యాసాగర్ రావు హాస్పిటల్ లో చేరిన తర్వాత... అక్కడకు వెళ్లి కేసీఆర్ పరామర్శించారు. అంతేకాదు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు.

  • Loading...

More Telugu News