: రైతుల సమస్యలపై.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలోని రైతులంతా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారన్నదానికి ఖమ్మం మార్కెట్ యార్డులో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా ఇస్తామన్న ఎరువులను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ లో కేటాయింపులు లేవంటూ కుంటి సాకులు చెప్పొద్దని... ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ను సవరించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 55 లక్షల మంది రైతుల వివరాలను సేకరించాలని డిమాండ్ చేశారు.