: దూసుకెళ్లగల యువ నేతల కోసం బీజేపీ టాలెంట్ హంట్


తమకు పెద్దగా పట్టు లేని రాష్ట్రాల్లో పుంజుకునేందుకు బీజేపీ టాలెంట్ హంట్ ను ప్రారంభించింది. నరేంద్ర మోదీ చేపట్టిన పలు పథకాలు సత్ఫలితాలను ఇస్తుండటం, ఇటీవలి కాలంలో ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటుతూ ఉండటంతో మిగతా ప్రాంతాలపై కన్నేసిన బీజేపీ యువ నేతల కోసం వెతుకులాట ప్రారంభించింది. ప్రభుత్వ విధానాలపై నమ్మకంగా ఉన్న పార్టీ నేతలు, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించి చెప్పే యువ నేతలు పెరగాలని భావిస్తోంది.

తమ పార్టీలో యువతను ప్రోత్సహిస్తామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పలు సమావేశాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనెలారంభంలో భువనేశ్వర్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాల్లోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కొత్త తరానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి పార్టీని ముందుకు తీసుకెళ్లే కొత్త ముఖాలు తమకు అవసరమని బీజేపీ భావిస్తోంది. మాక్ పార్లమెంటులు నిర్వహించడం,  చర్చాగోష్ఠులు పెట్టడం, వాటిల్లో అందరూ మెచ్చేలా మాట్లాడటం వంటి లక్షణాలున్న వారిని ఎంపిక చేసే బాధ్యత అమిత్ షాపై పెట్టినట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై సరైన అవగాహన ఉండి, ఏ విధమైన నేర చరిత్రా లేని యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News