: రేవంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన టీఆర్ఎస్ నేతలు


టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి సమక్షంలో దాదాపు 20 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పచ్చ కండువా కప్పుకున్నారు. వీరంతా పరిగికి చెందిన వారు. నిన్న టీడీపీ ఆధ్వర్యంలో తాండూరులో ప్రజాపోరు బహిరంగసభ జరిగింది. ఈ సభకు వెళుతున్న రేవంత్ కు మన్నెగూడలో టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన టీడీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పరిగికి చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతుందని అన్నారు. 

  • Loading...

More Telugu News