: రానా నా లక్కీ హీరో...ఎంత మంచోడో తెలుసా? : తాప్సీ


రానా నా లక్కీ హీరో అని అందాలతార తాప్సీ చెబుతోంది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేని తాప్సీ, బాలీవుడ్ లో మంచి పేరుతెచ్చుకుంది. తెలుగులో సినిమాలు చేసి, బిజీగా ఉన్న రోజులను తాప్సీ తాజాగా గుర్తు తెచ్చుకుంది. ఈ సందర్భంగా రానా గురించి మాట్లాడుతూ, రానా చాలా మంచోడని చెప్పింది. తనకు మంచి స్నేహితుడు అని కూడా అంది. రానా తనకు లక్కీ కోస్టార్ మాత్రమే కాకుండా లక్కీ ఛామ్‌ కూడా అని చెప్పింది. రానాతో తాను తమిళంలో నటించిన ‘ఆరంభం’ చాలా పెద్ద హిట్‌ అని గుర్తుచేసుకుంది. అలాగే తామిద్దరం కలిసి నటించిన హిందీ సినిమా ‘బేబీ’ తమ ఇద్దరికీ మంచి పేరుతెచ్చిందని తెలిపింది.

ఇక ‘ఘాజీ’ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇలా రానాతో తను నటించిన సినిమాలన్నీ తనకు ఎంతో కలిసి వచ్చాయని తెలిపింది. తాను హైదరాబాద్‌ వచ్చానని తెలిస్తే క్షణాల్లో ఫోన్ చేస్తాడని తెలిపింది. అంతే కాకుండా ‘ఏమైనా కావాలా? ఎక్కడికైనా వెళ్తావా? భోజనం చేశావా? ఏమైనా పంపనా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడని, తన పట్ల చాలా కేరింగ్ గా ఉంటాడని తెలిపింది. ఇది కేవలం తనకు మాత్రమే దక్కేది కాదని, రానాతో ఎవరు నటించినా ఇలాగే ఉంటాడని చివరిగా తాప్సీ సెలవిచ్చింది. 

  • Loading...

More Telugu News