: నల్లధనం కోసం కాదట... నోట్ల రద్దు వెనుక అసలు కారణాన్ని చెప్పిన ఆర్బీఐ
గత సంవత్సరం నవంబరులో మోదీ సర్కారు రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించిన తరువాత, దాన్ని అమలు చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఏం చెప్పింది? నోట్ల రద్దు వెనక అసలు కారణాలేంటన్న విషయాలను పార్లమెంటరీ స్థాయీ సంఘానికి లిఖితపూర్వకంగా వెల్లడించింది. నల్లధనం కోసం నోట్ల రద్దును తెరపైకి తేలేదని, దేశంలో చలామణి అవుతున్న నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకే నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం తమకు తెలిపిందని వెల్లడించింది.
ఇండియాలో నకిలీనోట్లు రూ. 400 కోట్ల వరకూ ఉంటాయని అంచనా వేసిన కేంద్రం, వీటి కోసమే పెద్ద నోట్లను రద్దు చేసినట్టు పేర్కొంది. రోజురోజుకూ నకిలీ నోట్ల సమస్య పెరుగుతూ ఉండటం, పొరుగు దేశాల్లోని ప్రభుత్వ ముద్రణాలయాల్లోనే వీటిని ముద్రిస్తుండటం సమస్య కావడంతో, దీన్నుంచి బయట పడేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్టు తెలిపింది.