: సోషల్ మీడియా వినియోగదారులకు 'బాహుబలి' టీమ్ సూచన!


'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా ఆన్ లైన్ లో లీకైందని తెలిసిన వెంటనే అప్రమత్తమైన చిత్ర నిర్మాతలు వేగంగా స్పందించారు. యాంటీ సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే ఆపేయకుండా, వివిధ సైట్లలో దర్శనమిచ్చిన లింకులను తొలగించేశారు. అనంతరం ఫేస్ బుక్ లైవ్ ఆప్షన్ ద్వారా ఫేస్ బుక్ లో పలువురు అభిమానులు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారని తెలియడంతో ఆందోళనకు గురై... ఒక ప్రకటన విడుదల చేశారు.

'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాను థియేటర్లో చూసి ఆనందించాలని సూచించారు. అంతేకానీ వీడియోలను సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ లో అప్‌ లోడ్‌ చేయవద్దని సూచించారు. యాంటీ పైరసీ టీం అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటుందని వారు హెచ్చరించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా‌ ట్వీట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. 

  • Loading...

More Telugu News