: అమెరికా థియేటర్లలో ‘బాహుబలి-2’ అయిపోగానే ప్రేక్షకులు లేచినిలబడి సెల్యూట్ చేస్తున్నారు: కోదండరామిరెడ్డి


ఈ రోజు విడుదలైన ‘బాహుబలి-2’ చిత్రంపై పలువురు సినీ హీరోలు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, ‘ఆల్ రెడీ ఈ సినిమా చూసిన వాళ్ల టాక్ ఏంటంటే..‘ఎక్స్ స్ట్రార్డినరీ’.. చాలా బాగుంది..సూపర్ డూపర్ హిట్ అని చెబుతున్నారు. ఈ సినిమా బాగుంటుందని ముందు నుంచే అందరూ అనుకుంటున్నాము. అమెరికా నుంచి కూడా బ్రహ్మాండమైన టాక్ వచ్చింది. సినిమా అయిపోయిన తర్వాత, అందరూ లేచి సెల్యూట్ చేస్తున్నారట. తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఇంత బాగా తీసుకువెళ్లిన రాజమౌళికి.. అంతకంటే, కావాల్సిందేముంది?’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News