: 500 కేజీల నుంచి 176 కేజీలకు తగ్గిన భారీకాయురాలు!
ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా గుర్తింపు పొందిన ఈజిప్టు మహిళ ఎమాన్ అహ్మద్ ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. 500 కేజీల బరువున్న ఆమె ప్రస్తుతం 176 కేజీలకు చేరుకుందని డాక్టర్లు తెలిపారు. అయితే, ఎమాన్ ఏ మాత్రం బరువు తగ్గలేదని... పైగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆమె సోదరి డాక్టర్లపై ఆరోపణలు చేసింది. వీటిని ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది కూడా. ఇక, వచ్చేటప్పుడు ఛార్టర్డ్ కార్గో విమానంలో ముంబయికి తీసుకుకొచ్చిన ఎమాన్ ను... ఇప్పుడు సాధారణ విమానంలో బిజినెస్ క్లాస్ ప్యాసింజర్ గా అబుదాబికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివరాలను సైఫీ ఆస్పత్రికి చెందిన బేరియాట్రిక్ సర్జరీ సెక్షన్ చీఫ్ అపర్ణా భాస్కర్ తెలిపారు.