: పెద్దమ్మ సమక్షంలో ప్రభాస్ కటౌట్ కి పాలాభిషేకం!
సీనియర్ నటుడు కృష్ణంరాజు భార్య, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పెద్దమ్మ వరుస అయ్యే శ్యామల ఈ రోజు విడుదలైన ‘బాహుబలి-2’ చిత్రాన్ని చూశారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ లో ఈ చిత్రాన్ని చూసేందుకు ఆమె వచ్చిన సందర్భంలో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. శ్యామల సమక్షంలో ప్రభాస్ కటౌట్ కు అభిమానులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ, ‘మా బాబుపై మీ ఆదరణ, అభిమానం ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.