: అమర జవాన్ల పిల్లలకు అండగా నేనుంటా: గౌతమ్ గంభీర్
భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. మావోయిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల పిల్లలకు అండగా తానుంటానని... వారికి ఆర్థిక సాయం అందిస్తానని గంభీర్ చెప్పాడు. మావోల దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వార్త విని తాను చాలా కలత చెందానని... అమరవీరుల పిల్లల చదువుల కోసం అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని చెప్పాడు. తన ఫౌండేషన్ తరపున ఈ సాయం చేస్తానని తెలిపాడు. అంతేకాదు, మావోల హత్యాకాండను నిరసిస్తూ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నల్ల రంగు బ్యాడ్జీని ధరించాడు.